టీడీపీ విజయానికి కృషి చేయాలి: సోమిశెట్టి

ABN , First Publish Date - 2022-06-11T06:19:11+05:30 IST

బాలకృష్ణ, మోక్షజ్ఞ అభిమాన సంఘాలు, అభిమానులు టీడీపీ విజయానికి కృషి చేయాలని టీడీపీ కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

టీడీపీ విజయానికి కృషి చేయాలి: సోమిశెట్టి

 ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు, 

రక్తదాన శిబిరాలు  


కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 10:  బాలకృష్ణ, మోక్షజ్ఞ అభిమాన సంఘాలు, అభిమానులు టీడీపీ విజయానికి కృషి చేయాలని టీడీపీ కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.  శుక్రవారం కర్నూలు నగరంలోని జిల్లా కార్యాలయంలో బాలకృష్ణ అభిమాన సంఘం, మోక్షజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.  63 మంది అభిమానులు రక్తదానం చేశారు.  పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, కర్నూలు టీడీపీ ఇన్‌చార్జి టీజీ భరత్‌ పాల్గొని  కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీజీ భరత్‌, సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  బాలకృష్ణ ఒకవైపు సినీ రంగంలో రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొడుతూనే మరోవైపు సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శులు నాగేంద్రకుమార్‌, పోతురాజు రవికుమార్‌, తెలుగు యువత నాయకులు సోమిశెట్టి నవీన్‌ కుమార్‌, అబ్బాస్‌, సత్రం రామకృష్ణుడు, హనుమంతరావు చౌదరి, బొగ్గుల ప్రవీణ్‌, బజారన్న, పేరపోగు రాజు, లతీఫ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more