‘హత్యా రాజకీయాలు అరికట్టాలి’

ABN , First Publish Date - 2022-02-16T05:40:35+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో హత్యారాజకీయాలు గ్రామగ్రామాన వ్యాపిస్తున్నాయని, అరికట్టాలని ఐటీడీపీ కర్నూలు ఇన్‌చార్జి గట్టు తిలక్‌, టీడీపీ బీసీ సెల్‌ నాయకులు రాజుయాదవ్‌ ఆరోపించారు.

‘హత్యా రాజకీయాలు అరికట్టాలి’
విలేకరులతో మాట్లాడుతున్న నాయకులు

కర్నూలు(అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 15: ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో హత్యారాజకీయాలు గ్రామగ్రామాన వ్యాపిస్తున్నాయని, అరికట్టాలని ఐటీడీపీ కర్నూలు ఇన్‌చార్జి గట్టు తిలక్‌, టీడీపీ బీసీ సెల్‌  నాయకులు రాజుయాదవ్‌ ఆరోపించారు. మంగళవారం మూడో పట్టణ సీఐని కలిసి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ తమ నేతలు చంద్రబాబు, నారా లోకేష్‌ను వైసీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడుతున్నారని, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రం రావణకాష్టంలా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. గత టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఠాకక్షలను ప్రేరేపించే వారిని కఠినంగా శిక్షించేలా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారన్నారు.


Read more