వైసీపీకి గుణపాఠం చెప్పాలి: టీడీపీ

ABN , First Publish Date - 2022-06-07T06:31:17+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర హజ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోమిన్‌ అహ్మద్‌హుసేన్‌, ఆత్మ మాజీ చైర్మన్‌ కంచర్ల గోవిందరెడ్డి, టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సి.కలీముల్లా పిలుపునిచ్చారు.

వైసీపీకి గుణపాఠం చెప్పాలి: టీడీపీ
ఆత్మకూరులో బాదుడే.. బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు

ఆత్మకూరు, జూన్‌ 6: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర హజ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోమిన్‌ అహ్మద్‌హుసేన్‌, ఆత్మ మాజీ చైర్మన్‌ కంచర్ల గోవిందరెడ్డి, టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సి.కలీముల్లా పిలుపునిచ్చారు. ఆత్మకూరు పట్టణంలోని 5వ వార్డులో సోమవారం బాదుడే..బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల గురించి వివరించారు. అనంతరం వార్డులో నిరసన ర్యాలీ చేపట్టారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శి బాషా, జిల్లా అధికార ప్రతినిధి మోమిన్‌ ముస్తఫా, తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఆరీఫ్‌, నాయకులు పస్పీల్‌, అలిహుసేన్‌, ఖాజమొహిద్దీన్‌, షాబుద్దీన్‌, గౌస్‌, రామకృష్ణ, సుబ్బరాజు, మన్సూర్‌అలి, విజయ్‌, అబ్దుల్‌వహీద్‌ ఉన్నారు. 


కొత్తపల్లి: వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పతనం తప్పదని టీడీపీ మండల అబ్జర్వర్‌ మహేష్‌ నాయుడు, నాయకులు వెంకటరెడ్డి, చంద్రశేఖరరెడ్డి అన్నారు. మండలంలోని లింగాపురం గ్రామంలో సోమవారం బాదుడే.. బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభు త్వం విస్మరించిందని ఆరోపించారు. నాయకులు లింగస్వామిగౌడు, నాగశేషన్న, చిన్న పుల్లారెడ్డి, శివారెడ్డి, బుచ్చిరెడ్డి, లింగన్న, నాగేశ్వరయాదవ్‌, శివారెడ్డి, మోహన్‌యాదవ్‌, సుబ్బరాయుడు తదిరతులు పాల్గొన్నారు.
Read more