కోసిగికి త్వరలో టీడీపీ అధినేత రాక

ABN , First Publish Date - 2022-10-14T05:30:00+05:30 IST

కోసిగికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన త్వరలో ఉంటుందని మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

కోసిగికి త్వరలో టీడీపీ అధినేత రాక

మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి

కోసిగి, అక్టోబరు 14: కోసిగికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన త్వరలో ఉంటుందని మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం కోసిగిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోసిగి మండల పరిధిలోని ఆర్డీఎస్‌, పులికనుమ ప్రాజెక్టులను పరిశీలించేందుకు చంద్రబాబు నాయుడు వస్తారని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పులికనుమ ప్రాజెక్టు నుంచి రెండు తూముల ద్వారా కోసిగి మండలానికి సాగు, తాగునీరు అందించాలని, నీరు చెట్టులో భాగంగా పనులు చేస్తుంటే.. బసలదొడ్డి గ్రామానికి చెందిన వైసీపీ బాలయ్య, హైకోర్టులో స్టే తీసుకువచ్చి పనులకు అడ్డుపడ్డారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయినా పులికనుమ ద్వారా కోసిగి మండలానికి సాగు, తాగునీరు అందించలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆర్డీఎస్‌ ఆనకట్టను కూడా చంద్రబాబు పరిశీలిస్తారని తెలిపారు.

Read more