అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టండి

ABN , First Publish Date - 2022-12-12T00:58:29+05:30 IST

డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహా ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టండి

రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌

కర్నూలు(కలెక్టరేట్‌) డిసెంబరు 11: డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహా ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కర్నూలు నగరం జొహరాపురం గ్రామంలో డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహా ప్రతిష్ఠ కోసం రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ దళిత సంఘాల నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో హరిప్రసాద్‌, తహసీల్దార్‌ రమేష్‌, దళిత సంఘాల నాయకులు ఉన్నారు.

Updated Date - 2022-12-12T00:58:29+05:30 IST

Read more