‘టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ దారుణం’

ABN , First Publish Date - 2022-03-23T05:36:24+05:30 IST

బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రశ్నిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను అకారణంగా ప్రతిరోజూ సస్పెండ్‌ చేస్తుండటం దారుణమని, ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్‌ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు ధరూర్‌ జేమ్స్‌ అన్నారు.

‘టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ దారుణం’

కర్నూలు(అగ్రికల్చర్‌), మార్చి 22: బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రశ్నిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను అకారణంగా ప్రతిరోజూ సస్పెండ్‌ చేస్తుండటం దారుణమని, ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్‌ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు ధరూర్‌ జేమ్స్‌ అన్నారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీని ప్రజల ప్రయోజనాల కోసమే వినియోగించాలనే సదుద్దేశం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఏ మాత్రం లేదని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో వారు ప్రవర్తిస్తున్న తీరును బట్టి స్పష్టమవుతోందని అన్నారు. జంగారెడ్డిగూడెం ఘటనను శాసనసభలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా సభను తప్పుదోవ పట్టించడం దారుణమన్నారు. జంగారెడ్డిగూడెం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు, ముఖ్యమంత్రిని నిలదీసినందుకు కక్షకట్టి స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చి సస్పెండ్‌ చేయించడం దారుణమన్నారు. లో రవ్వలకొండను

Read more