‘ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయండి’

ABN , First Publish Date - 2022-04-05T05:48:27+05:30 IST

కోసిగి మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

‘ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయండి’

కోసిగి, ఏప్రిల్‌ 4: కోసిగి మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. కోసిగిలోని మోడల్‌ స్కూల్‌లో సోషల్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌ కుమార్‌ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఐదు రోజుల క్రితం ప్రిన్సిపల్‌ సమీరారెడ్డికి విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈవిషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు ఏఐఎ్‌సఎఫ్‌, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకులు రాజు, వీరేష్‌, మహదేవ, రామచంద్రనాయుడులు పాఠశాల ముందు విద్యార్థినులతో కలిసి సోమవారం ధర్నా చేశారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ మాదన్నతో గొడవకు దిగారు. అనంతరం ఎస్‌ఐ ధనుంజయ్‌కు సం ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్య లు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ సమీరారెడ్డిని వివరణ కోరగా.. విద్యార్థినులు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు ప్రవీణ్‌ కుమార్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని, ఆయనపై జిల్లా ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
Read more