సర్వేయర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-17T05:45:48+05:30 IST

పట్టణంలోని గీతా వీధిలో నివాసం ఉంటున్న ప్రతాప్‌ కుమార్తె అవివాహిత సర్వేయర్‌ రోజా(25) శుక్రవారం ఇంటిలోని రెండో అంతస్తులో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు.

సర్వేయర్‌ ఆత్మహత్య

ఆళ్లగడ్డ, సెప్టెంబరు 16: పట్టణంలోని గీతా వీధిలో నివాసం ఉంటున్న ప్రతాప్‌ కుమార్తె అవివాహిత సర్వేయర్‌ రోజా(25) శుక్రవారం ఇంటిలోని రెండో అంతస్తులో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. రోజా దొర్నిపాడు మండలం బుర్రారెడ్డిపల్లె సచివాలయంలో సర్వేయర్‌గా పనిస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ తిమ్మయ్య చెప్పారు.


దొర్నిపాడు: సర్వేయర్‌ రోజా మృతికి తహసీల్దార్‌ జయప్రసాద్‌ ఎంపీడీవో నాగఅనసూయ, సచివాలయ సిబ్బంది, తహసీల్దార్‌ సిబ్బంది నివాళి అర్పించారు.  ఆమె మృతి బాధాకరం అని వారు అన్నారు. 


Read more