-
-
Home » Andhra Pradesh » Kurnool » sunil deodhar comments anr-MRGS-AndhraPradesh
-
Sunil Deodhar: వైసీపీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోంది..
ABN , First Publish Date - 2022-09-19T20:09:51+05:30 IST
అధికారంలో ఉన్న వైసీపీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ నేత సునీల్ థియోధర్ విమర్శించారు.

కర్నూలు (Kurnool): అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ నేత సునీల్ థియోధర్ (Sunil Deodhar) విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ భూ మాఫియా నేతలకు శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి (Bala Nagireddy) ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలులో హైకోర్టు (High Court) ఏర్పాటు చేయాలని.. బీజేపీ (BJP) దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోందన్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో ఒక అవినీతి చేస్తే.. సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మూడు రెట్ల అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు.
మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ (TG Venkatesh) మాట్లాడుతూ.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ ఆస్పత్రికి వంద కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు నిర్మించలేదని టీజీ వెంకటేష్ అన్నారు.