టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి

ABN , First Publish Date - 2022-05-24T06:21:24+05:30 IST

తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి
టీడీపీ సభ్యత్వ నమోదులో పాల్గొన్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

 కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి

కర్నూలు(అగ్రికల్చర్‌), మే 23:  తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి  సాధ్యమని, పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కర్నూలు నగరంలోని పార్టీ కార్యాలయంలో 50, 51 వార్డుల్లోని ప్రజలకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గోపినాథ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రాంపుల్లయ్య యాదవ్‌, నరసింహ యాదవ్‌, 50వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి లోక్‌నాథ్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్ర కుమార్‌, తెలుగు యువత ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్‌, 51వ వార్డు కార్పొరేటర్‌ మౌనికారెడ్డి పాల్గొన్నారు.

గూడూరు: కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజాదరణ చూస్తుంటే రాబోయే రోజుల్లో టీడీపీ విజయం ఖాయమనిపిస్తుందని కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌, మండల టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ సుధాకర్‌ రెడ్డి అన్నారు. సోమవారం గూడూరు మండలంలోని బుడిదపాడు గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బంగారు శ్రీనివాసులు, రాముడు, కృష్ణ, శ్రీను పాల్గొన్నారు.Read more