శ్రీశైల జలాశయానికి స్వల్పంగా ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2022-11-17T01:28:35+05:30 IST

శ్రీశైల జలాశయానికి బుధవారం ఎగువ పరివాహక ప్రాంతం సుంకేసుల నుంచి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతొంది.

 శ్రీశైల జలాశయానికి స్వల్పంగా ఇన్‌ఫ్లో

శ్రీశైలం, నవంబరు 16: శ్రీశైల జలాశయానికి బుధవారం ఎగువ పరివాహక ప్రాంతం సుంకేసుల నుంచి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతొంది. సాయంత్రం 6గంటల సమయానికి సుంకేసుల నుంచి 4,446 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.40 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 170.2645 టీఎంసీలుగా నమోదయింది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఏపీ విద్యుత్‌ కేంద్రం ద్వారా 27,290 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్‌ కేంద్రం ద్వారా 28,252 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

Updated Date - 2022-11-17T01:28:36+05:30 IST