‘సిద్ధన్న గట్టు’ షూటింగ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-25T05:06:23+05:30 IST

సినీ నటుడు సుమన ప్రధాన పాత్రలో నటిస్తున్న సిద్ధన్నగట్టు చిత్రం షూటింగ్‌ ఆదివారం రాత్రి ప్రారంభమైంది.

‘సిద్ధన్న గట్టు’ షూటింగ్‌ ప్రారంభం
గౌరు వెంకటరెడ్డి నివాసంలో చిత్ర చిత్రీకరణలో సినీ నటుడు సుమన

 ముహూర్తం క్లాప్‌ కొట్టి  ప్రారంభించిన గౌరు వెంకటరెడ్డి


కర్నూలు (కల్చరల్‌), ఏప్రిల్‌ 24: సినీ నటుడు సుమన ప్రధాన పాత్రలో నటిస్తున్న సిద్ధన్నగట్టు చిత్రం షూటింగ్‌ ఆదివారం రాత్రి ప్రారంభమైంది. నం దికొట్కూరు మండలం, బ్రాహ్మణ కొట్కూరులో టీడీపీ నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి స్వగృహంలో ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించారు. గౌరు వెంకటరెడ్డి క్లాప్‌ కొట్టి ప్రారంభించగా, తొలి షాట్‌ను సుమనపై చిత్రీకరించారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు చెందిన చిత్ర నిర్మాతలు, దర్శకుడు ఈ చిత్రాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిత్రీకరిస్తుండటం అభినందనీయమని చెప్పా రు. అందుకు అనుగుణంగా తన స్వగృహం సినిమా చిత్రీకరణకు అనుమతించినట్లు తెలిపారు. తొలి రోజు చిత్రీకరణలో ఢీఫేం అక్షాఖాన, నటీనటులు బైటింటి మీనాక్షిరెడ్డి, విజయలక్ష్మి, జలీల్‌బాషా, సత్యం, సలీం, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఎంఎం ప్రొడక్షన్స బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం మను వహిస్తుండగా, మహర్షి గురుస్వామితోపాటూ పలువురు టీవీ, సినీ నటులు నటిస్తున్నారు. మాటలు వినోద్‌ వద్దిరాలి, సంగీతం నాని జాన సమకూరుస్తున్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో చిత్ర షూటింగ్‌ కొనసాగిస్తామని దర్శకుడు మను తెలిపారు. 


Read more