కరువు జిల్లాగా ప్రకటించాలి: టీడీపీ

ABN , First Publish Date - 2022-12-12T00:56:46+05:30 IST

కర్నూలును ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రక టించాలని టీడీపీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌నాయుడు ఆదివారం డిమాండ్‌ చేశారు.

కరువు జిల్లాగా ప్రకటించాలి: టీడీపీ

గోనెగండ్ల, డిసెంబరు 11: కర్నూలును ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రక టించాలని టీడీపీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌నాయుడు ఆదివారం డిమాండ్‌ చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, అరకొరగా పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. జిల్లాలో ఎక్కువగా ఉల్లి, పత్తి పంటలను గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు మండలాల్లో సాగు చేస్తారన్నారు. ఈ ఏడాది పత్తి వర్షం కురియక పోవడంతో పంట మొత్తం ఎండిపోయిందని, ఉల్లి పంటకు గిట్టు బాటు ధర లేదని అన్నారు. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు బ్యాంక్‌ రుణాలు, ఇవ్వాలని కరువు పరిహారం కింద రైతులకు ఎకరానికి రూ.50,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కౌలుట్లయ్యనాయుడు, దరగలమాబు, చెన్నలరాయుడు, మందకల్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:56:46+05:30 IST

Read more