ఎస్‌ఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సంఘం కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2022-04-25T04:47:44+05:30 IST

నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా సంబంధించిన ఎస్‌ఏ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) సంఘానికి కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎస్‌ఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సంఘం కార్యవర్గం ఎన్నిక

కర్నూలు(స్పోర్ట్స్‌)/నంద్యాల (నూనెపల్లె), ఏప్రిల్‌ 24: నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా సంబంధించిన ఎస్‌ఏ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) సంఘానికి కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం విశ్రాంత వ్యాయామ అధ్యాపకుడు విశ్వేశ్వరయ్య సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం నుండి ఉపాధ్యక్షుడు జాకీర్‌ హుశేన్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సహాయకులుగా సీనియర్‌ వ్యాయామ ఉపాధ్యాయులు అబ్రహం లింకన్‌ వ్యవహరించారు. కర్నూలు జిల్లా అధ్యక్షులుగా శ్రీనాథ్‌ పేరుమాళ్ల, ప్రధాన కార్యదర్శిగా పుల్లన్న, కోశాధికారిగా లతీఫ్‌, నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా నాగేంద్ర, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, కోశాదిధికారిగా భుజంగరావులను రెండు జిల్లాల వ్యాయామ ఉపాధ్యాయులు  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే రాష్ట్ర మహిళా కార్యదర్శులుగా కర్నూలు నుంచి జయమ్మను నంద్యాల నుంచి ఆశాలతను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ రెడ్డి మాట్లాడుతూ వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో, పీఈటీలను, పీడీలుగా అప్‌గ్రేడ్‌ చేసి భారీగా పదోన్నతులు కల్పించడంలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సంఘం ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపారు. ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి రమణారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, భాస్క ర్‌ రెడ్డి, నంద్యాల జిల్లా శాఫ్‌ జిల్లా కోఆర్డినేటర్‌ రవికుమార్‌, స్వామిదాసు, మోడల్‌ స్కూల్‌ ప్రతినిధి శ్రీనివాసులు, యోగా అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవినాష్‌, ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకన్న, మహిళా జాతీయ ప్రాతినిధ్య వ్యాయామ ఉపాధ్యాయినులు జయమ్మ, రాజేశ్వరి, ఆశా, కవిత పాల్గొన్నారు.

Read more