రోడ్డు ప్రమాదంలో విశ్రాంత సైనికుడి మృతి

ABN , First Publish Date - 2022-03-16T05:54:25+05:30 IST

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నగల్లపాడు టోల్‌ప్లాజా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత సైనికుడు నిసార్‌ఖాన్‌(79) మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో విశ్రాంత సైనికుడి మృతి

చాగలమర్రి, మార్చి 15: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నగల్లపాడు టోల్‌ప్లాజా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత సైనికుడు నిసార్‌ఖాన్‌(79) మృతి చెందారు. ఎస్‌ఐ రమణయ్య వివరాల మేరకు.. కడప నగరం కుమ్మరకుంటకు చెందిన నిసార్‌ఖాన్‌ కర్నూలు నుంచి కడపకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టోల్‌ప్లాజా సమీపంలో ఆళ్లగడ్డ నుంచి బద్వేల్‌కు వరి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి కిందపడ్డాడు. దీంతో ట్రాక్టర్‌ టైరు నిసార్‌ఖాన్‌ తలపై వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నిసార్‌ఖాన్‌ను ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. Read more