-
-
Home » Andhra Pradesh » Kurnool » Rivers flooded by heavy rain-NGTS-AndhraPradesh
-
భారీ వర్షంతో పొంగిన వాగులు
ABN , First Publish Date - 2022-10-01T05:57:51+05:30 IST
మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉధృతంగా ప్రవహించిన తుమ్మలవాగు
నిలిచిన రాకపోకలు
కోడుమూరు
(రూరల్), సెప్టెంబరు 30: మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు
కురుస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి వేకువ జాము వరకు ఎడతెరపిలేని
వర్షం కురిసింది. వర్ష ప్రభావంతో వాగులు, వంకలు పొంగాయి. లోతట్టు వీధులు,
పొలాలు నీట మునిగాయి. కోడు మూరు- ఎమ్మిగనూరు రహదారిపై వర్కూరు వద్ద
తుమ్మలవాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని,
మంత్రాలయం వెళ్లు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 6 గంటల
నుంచి 9 గంటల వరకు వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. మంత్రాలయం వెళుతున్న ఓ
ప్రైవేటు ట్రావెల్ బస్సు వాగు దాటే క్రమంలో నిలిచిపోవడంతో ప్రయాణికులు
ఆందోళనకు గురయ్యారు. వర్షపు నీరు భారీగా చేరడంతో గోరంట్ల వద్ద హంద్రీనది
నిండుగా ప్రవహించింది. గోరంట్ల రైతులు, అవతలి ఒడ్డు గ్రామాలైన ఎర్రగుడి,
కొత్తపల్లి, మన్నెగుంట తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొన్నారు. శుక్రవారం 39.0 మి.మీ. వర్షపాతం నమోదైంది.