-
-
Home » Andhra Pradesh » Kurnool » Responsive applications should be dealt with by DRO-NGTS-AndhraPradesh
-
స్పందన అర్జీలను పరిష్కరించాలి: డీఆర్వో
ABN , First Publish Date - 2022-07-05T06:45:56+05:30 IST
స్పందన అర్జీలను పరిష్కరించాలని డీఆర్వో నాగేశ్వరరావు సంబంధిత అదికారులను ఆదేశించారు.

కర్నూలు(కలెక్టరేట్), జూలై 4:
స్పందన అర్జీలను పరిష్కరించాలని డీఆర్వో నాగేశ్వరరావు సంబంధిత అదికారులను
ఆదేశించారు. 24, 48 గంటల్లపు బీయాండ్ ఎస్‌ఎల్‌ఏలో వెళ్లే సమస్యలను వెంటనే
పరిష్కరించాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో స్పందన
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్వో నాగేశ్వరరావు, డిజబుల్ ఏడీ విజయ,
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ తదితర జిల్లా నలుమూలల నుంచి వచ్చిన
ప్రజల అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భం గా డీఆర్వో మాట్లాడుతూ ఈ వారంలో
వివిధ శాఖలకు సంబంధించిన 36 అర్జీలు రీఓపెన్ అయ్యాయనీ, వాటిలో
వ్యవసాయశాఖకు సంబంధించినవి 10, పంచాయతీరాజ్ 7, రెవెన్యూ 6, మున్సిపల్
అడ్మినిస్ర్టేషన్ 4, పోలీ్‌సకు సంబంధించి రెండు, సర్వే సెటిల్మెంట్ అండ్
ల్యాండ్ రికార్డ్స్‌కు 2, ఏపీ సౌత్ పవర్ డిస్ర్టిబ్యూషన్ కో లిమిటెడ్
(ఏపీఎ్‌సపీడీసీఎల్) సంబందించి 1, రూరల్ డెవల్‌పమెంట్‌కు 1, వైఎస్సార్
ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ 1, స్పెషల్ ఎన్‌రోల్‌మెంట్ బ్యూరో 1,
పశుసంవర్థకశాఖ 1, మొత్తం 11 శాఖలకు సంబంధించి 36 దరఖాస్తులు రీఓపెన్
అయ్యాయన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.