రేపు నంద్యాలలో స్పందన

ABN , First Publish Date - 2022-04-10T05:59:51+05:30 IST

కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఈనెల 11వ తేదీన స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌ తెలిపారు.

రేపు నంద్యాలలో స్పందన

నంద్యాల టౌన్‌, ఏప్రిల్‌ 9 : కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఈనెల 11వ తేదీన స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌ తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ హాజరు కావాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంతోపాటు మండల, నియోజకవర్గ, డివిజన్‌ స్థాయిలో కూడ యథాతధంగా స్పందన కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 


రేపు ఎస్పీ కార్యాలయంలో స్పందన 


నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఈనెల 11వ తేదీన స్పందన కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ రఘువీరారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్‌ స్థాయిలో కూడా స్పందన జరుగుతుందని ఆయన తెలిపారు.

Read more