రాఘవేంద్రుని సన్నిధిలో కర్ణాటక ప్రజాప్రతినిధులు

ABN , First Publish Date - 2022-10-12T05:02:31+05:30 IST

రాఘవేంద్రస్వామి దర్శ నార్థం కర్ణాటక రాష్ట్ర ప్రజాప్రతినిధులు మంత్రాలయానికి వచ్చారు.

రాఘవేంద్రుని సన్నిధిలో కర్ణాటక ప్రజాప్రతినిధులు
రాఘవేంద్రస్వామిని దర్శించుకుంటున్న ప్రజాప్రతినిధులు

ముఖ్యమంత్రి, మంత్రులు, మాజీ ముఖ్యమంత్రికి పూర్ణకుంభ స్వాగతం

మంత్రాలయం, అక్టోబరు 11: రాఘవేంద్రస్వామి దర్శ నార్థం కర్ణాటక రాష్ట్ర ప్రజాప్రతినిధులు మంత్రాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యాడ్యూరప్ప, రవాణాశాఖ మంత్రి శ్రీరాములు, ఇరిగేషన్‌ మంత్రి గోవింద్‌ ఖార్జోల్‌, టెక్స్‌టైల్‌ శాఖ మంత్రి శంకర్‌పాటిల్‌, ఎమ్మెల్సీ రవికు మార్‌కు ఆలయ మహాముఖద్వారం వద్ద మఠం అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామి బృందావ నానికి ప్రత్యేక పూజలు చేశారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీ ర్థులు వారికి రాఘవేంద్రస్వామి మెమెంటో, ఫలపుష్ప, మంత్రాక్షిత లు, వెండి గిన్నె, వెండి తులసిమాల, శేషవస్త్రం, పరి మళ ప్రసా దం ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో రాజా ఎస్‌ గిరిరాజాచార్‌, మఠం అధికారులు, రాయచూరు జిల్లా ఎస్పీ నిఖిల్‌, రాయచూరు ఎమ్మెల్యే శివరాజ్‌ పాటిల్‌, కేంద్ర హెచ్‌పీఐఎల్‌ డైరెక్టర్‌ గిరీష్‌, ఆదోని డీఎస్పీ వినోద్‌ కుమార్‌, రాయచూరు ఏఎఎస్పీ కృష్ణకాంత్‌ పాటిల్‌, ప్రేమానంద్‌, డీఎస్పీ వెంకటేష్‌ పాల్గొన్నారు.

 స్నాన ఘట్టాల నిర్మాణానికి..శిలాఫలకం ఆవిష్కరణ

మఠం సమీపంలో ప్రవహిస్తున్న తుంగభద్ర నదితీరంలో రూ.11 కోట్లతో స్నాన ఘట్టాల నిర్మాణాల శిలాఫలకాన్ని మంగళ వారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప, పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 224 సీట్లకుగాను 150 సీట్లకు పైగా గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు. రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు, కర్ణాటక ప్రజల దీవెనలతో 150 సీట్లు గెలిచి బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. రాయచూరు జిల్లాలో బీజేపీ హవా కొనసాగు తోందని తెలిపారు. సమావేశంలో కేంద్ర హెచ్‌పీఐఎల్‌ డైరెక్టర్‌ గిరీష్‌ కనకవీడు, ఎమ్మెల్సీ రవికుమార్‌, రాయచూరు ఎమ్మెల్యే శివరాజ్‌ పాటిల్‌, శంకరప్ప, వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more