ఎన్టీఆర్‌ పేరు తొలగించడం అవివేకం

ABN , First Publish Date - 2022-09-29T05:45:48+05:30 IST

ఆంధ్రుల ఆరాధ్యదైవమైన నందమూరి తారకరామారావు పేరును హెల్త్‌ యునివర్శిటీకి తొలగించడం సీఎం జగన్‌ అవివేకానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మండిపడ్డారు.

ఎన్టీఆర్‌ పేరు తొలగించడం అవివేకం
టీడీపీ రిలే దీక్షల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తదితరులు

పేర్లు మార్చుతూ పబ్బం గడుపుకుంటున్న వైసీపీ
రిలే నిరాహార దీక్షలు ప్రారంభం


ఎమ్మిగనూరు, సెప్టెంబరు 28:
ఆంధ్రుల ఆరాధ్యదైవమైన నందమూరి తారకరామారావు పేరును హెల్త్‌ యునివర్శిటీకి తొలగించడం సీఎం జగన్‌ అవివేకానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మండిపడ్డారు. విజయవాడలోని హెల్త్‌ యునివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించటాన్ని నిరసిస్తూ పట్టణంలోని సోమప్ప సర్కిల్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యవిద్యకు ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలన్న సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 1986లో హెల్త్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారన్నారు. నేడు ఆ యూనివర్సిటీకి సీఎం జగన్‌తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. పేరు మార్చుతూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా ఒక్క నిర్మాణం చేపట్టకపోగా ఉన్న ప్రభుత్వ భవనాలకు పేర్లు మార్చుతూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. రిలే దీక్షల్లో నాయకులు మాధవరావు దేశాయ్‌, ముగతి ఈరన్న గౌడ్‌, రంగస్వామి గౌడ్‌, సుందరరాజు, గడ్డం నారాయణ రెడ్డి, కటారి రాజేంద్ర, కృష్ణతేజనాయుడు, నజీర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామలింగారెడ్డి, వైపీఎం కొండయ్య చౌదరి, కౌన్సిలర్లు రామదాసు గౌడ్‌, వీజీఏ దయాసాగర్‌, నాయకులు చిన్న రాముడు, మిఠాయి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Read more