బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2022-04-25T04:51:35+05:30 IST

మంత్రాలయం మండలంలోని ఓ గ్రామంలో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

బాలికపై అత్యాచారం

కేసు నమోదు 


మంత్రాలయం, ఏప్రిల్‌ 24: మంత్రాలయం మండలంలోని ఓ గ్రామంలో  బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మాధవరం ఎస్‌ఐ హుశేన్‌పీరా తెలిపిన వివరాల మేరకు ఈ నెల 19న మంగళవారం మధ్యాహ్నం ఇంటి దగ్గర కసువు ఊడుస్తున్న బాలికను యువకుడు ఇంటిలోకి తీసుకెళ్లి, నోట్లో బట్టలు కుక్కి అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి బైక్‌ శబ్దం విని నిందితుడు పరారయ్యాడు. తండ్రి ఈ విషయంపై కుల పెద్దలతో పంచాయితీ పెట్టించాడు. అక్కడ న్యాయం జరగకపోవడంతో  ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  నిందితుడ్ని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హుశేన్‌పీరా తెలిపారు. 

Read more