వైభవంగా రామలింగేశ్వర స్వామి రథోత్సవం

ABN , First Publish Date - 2022-11-25T01:07:48+05:30 IST

మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో వెలసిన రామలింగేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది.

వైభవంగా రామలింగేశ్వర స్వామి రథోత్సవం
సుంకేశ్వరిలో రథాన్ని ఊరేగిస్తున్న దృశ్యం

మంత్రాలయం, నవంబరు 24: మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో వెలసిన రామలింగేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. గురువారం కార్తీక పూజల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సర్పంచ్‌ ముకురన్న ఆధ్వర్యంలో రథోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచి శివాలయానికి భక్తులు పోటెత్తారు. రథంపైన రామలింగేశ్వరస్వామి, పార్వతి, ఆంజనేయస్వామి చిత్రపటాలను అధిష్టించి గ్రామ వీధుల గుండా ఊరేగిం చారు. రథం ముందు బాణాసంచాలు పేలుస్తూ గురువయ్యల నాటక ప్రద ర్శన, నందికోలు, కోలాట నృత్యాలు, భక్తి పాటల మధ్య రథోత్సవం ముందుకు సాగింది. అనంతరం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర పౌరా ణిక నాటకం భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో మంచాల సింగిల్‌ విండో అధ్యక్షుడు ప్రదీప్‌రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సీవీ విశ్వనాథ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రఘునాథరెడ్డి, డీలర్‌ ఆంజనేయులు, కర్రెన్న, మల్లికా ర్జున పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T01:07:48+05:30 IST

Read more