-
-
Home » Andhra Pradesh » Kurnool » Rally on Tuberculosis Prevention-NGTS-AndhraPradesh
-
క్షయ వ్యాధి నివారణపై ర్యాలీ
ABN , First Publish Date - 2022-02-23T05:36:23+05:30 IST
క్షయ వ్యాధి నిర్మూలనపై అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు మంగళవారం ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించారు.

ఆదోని టౌన్, ఫిబ్రవరి 22: క్షయ వ్యాధి నిర్మూలనపై అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు మంగళవారం ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించారు. పుట్టిన ప్రతి బిడ్డకు బీసీజీ వేయించాలని, భౌతిక దూరం పాటిస్తూ, సమతుల ఆహారం తీసుకోవాలని ప్రజలకు వివరించారు. క్షయ నివారణ కేంద్రం సిబ్బంది బాబురాజు, స్వరూప్‌రాజ్, మనోరంజనిదేవి, సచివాలయ ఏఎన్‌ఎం రేవతి, ఆశా వర్కర్స్ జ్యోతి, మల్లమ్మ, అంగన్‌వాడీలు లక్ష్మీదేవి, ఉమామహేశ్వరి, భారతి పాల్గొన్నారు.