-
-
Home » Andhra Pradesh » Kurnool » Protesting TDP with candles does not stop fighting-MRGS-AndhraPradesh
-
కొవ్వొత్తులతో నిరసన టీడీపీ పోరు ఆగదు
ABN , First Publish Date - 2022-04-25T05:07:51+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత చార్జీలను తగ్గించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పాణ్యం టీడీపీ ఇనచార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

కల్లూరు, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత చార్జీలను తగ్గించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పాణ్యం టీడీపీ ఇనచార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. ఆదివారం 33వ వార్డు పాత కల్లూరులోని చెంచునగర్‌లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు కొవ్వొత్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంపదను సృష్టించడం చేతగాని సీఎం జగన.. పన్నులు పెంచుకుంటూ ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు పెంచి, చెత్తపై పన్నులు వసూలు చేస్తున్న చెత్త ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, పాణ్యం తెలుగు యువత అద్యక్షుడు గంగాధర్‌గౌడు, జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతూరు మధు, పవన, ఫిరోజ్, అల్లిపీరా, ఎనవీ రామకృష్ణ, మాదేష్, రవిప్రకాష్ రెడ్డి, ధనుంజయ, పోల్ రెడ్డి, దొడ్డిపాడు బాషా తదితరులు పాల్గొన్నారు.
ప్రజలపై బాదుడే..బాదుడు
ఎమ్మిగనూరు: రాష్ట్ర ప్రజలకు నవరత్నాలతోపాటు పదోరత్నంగా అధిక ధరలతో సీఎం బాదుడును కానుకగా ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం బనవాసి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో చివరి రోజు గౌరవసభను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ అధికారం లోకి వచ్చిన ఈ మూడేళ్లలో సీఎం జగన చేసిందేమీలేదన్నా రు. నవరత్నాలతోపాటు పన్నులు, విద్యుచార్జీలు, పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెం చారని అన్నారు. ఈ మూడేళ్లలో బనవాసి గ్రామం ఎంత అభివృద్ధి చెందుతుందని అనుకున్నానని, కానీ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేయించిన రోడ్డునే వేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతిలో బనవాసిని నంబర్ వన అయిందని అన్నారు. అనంతరం విద్యుత చార్జీల పెంపునకు నిరసనగా లాంతర్లు, కొవ్వొత్తులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాల్మీకి శంకరయ్య, మల్లికార్జున, సోమేశ్వరరెడ్డి, కృష్ణతేజనాయుడు, శంకర్‌గౌడ్, నరసింహులు, సురే్‌షచౌదరి, లక్‌రెడ్డి పాల్గొన్నారు.