సీమ సమస్యల పరిష్కారం కోసం నిరసన

ABN , First Publish Date - 2022-10-02T05:53:53+05:30 IST

రాయలసీమ సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాయలసీమ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో శనివారం కలేక్టరేట్‌ ముందు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.

సీమ సమస్యల పరిష్కారం కోసం నిరసన
గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న నాయకులు

కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 1: రాయలసీమ సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాయలసీమ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో శనివారం కలేక్టరేట్‌ ముందు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేదిక కో కన్వీనర్‌ భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం వల్ల 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. అయితే ఏడు దశాబ్దాలుగా రాయలసీమ ప్రాం తం పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోందని, అన్ని పార్టీలు సీమకు ద్రోహం చేస్తు న్నాయని విమర్శించారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎలాంటి ప్రాధా న్యత లేని నవంబరు 1కి బదులుగా అక్టోబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలని కోరారు. రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వలసలు, కరువులు పోవడానికి వీలుగా వేదవతి ప్రాజెక్టు నిర్మాణాన్ని, ఆర్‌డీఎస్‌ కుడి కాలువ నిర్మాణం చేపట్టాలని, సిద్దేశ్వరం రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టి, శ్రీశైలం ప్రాజెక్టును పరిరక్షించాలని కోరారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాల యాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని, సీమలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీమ విద్యార్థి ఐసంఘం నాయకులు రామరాజు, ఆర్‌వీపీఎస్‌ నాయకులు రవికుమార్‌, సీమకృష్ణ, మోహన్‌, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు కోనేటి వెంకటేశ్వర్లు, ఆర్‌సీసీ నాయకులు లాజరస్‌, రాయలసీమ ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక నాయ కులు రామకృష్ణారెడ్డి, డీటీఎఫ్‌ నాయకులు మద్దయ్య, స్వామి, శేఖర్‌, విరసం కార్యవర్గ సభ్యుడు పాణి, రాయలసీమ విద్యావంతుల వేదిక కార్యవర్గ సభ్యుడు రత్నం ఏసేపు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-02T05:53:53+05:30 IST