రెండు జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2022-02-20T05:16:04+05:30 IST

వచ్చే విద్యా సంవ్సతరం నుంచి కొత్తపల్లి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు ఎంఈ వో శ్రీరాములు తెలిపారు.

రెండు జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు

కొత్తపల్లి, ఫిబ్రవరి 19: వచ్చే విద్యా సంవ్సతరం నుంచి కొత్తపల్లి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు ఎంఈ వో శ్రీరాములు తెలిపారు. శనివారం ఎంఈ వో మాట్లాడుతూ మండల కేంద్రమైన కొత్తపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లే గ్రౌండులో బాలికల జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అలాగే దుద్యాల హైస్కూల్‌ మైదానంలో కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పా రు. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తే మండలంలోని ఇంటర్‌ చదివే విద్యార్థులు ఇక నుంచి సుదూర ప్రాంతాల కు వెళ్ళి చదువు కోవాల్సిన అవసరం ఉండదని ఎంఈవో పేర్కొన్నారు.  


Read more