‘విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి’

ABN , First Publish Date - 2022-11-25T01:03:07+05:30 IST

జిల్లాలోని బీసీ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జాతీయ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి కే.రామకృష్ణ, రాష్ట్ర కార్య దర్శి కొత్తకోట మోహన్‌ డిమాండ్‌ చేశారు.

‘విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి’

కర్నూలు (ఎడ్యుకేషన్‌), నవంబరు 24: జిల్లాలోని బీసీ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జాతీయ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి కే.రామకృష్ణ, రాష్ట్ర కార్య దర్శి కొత్తకోట మోహన్‌ డిమాండ్‌ చేశారు. గురు వారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి వెంకటలక్ష్మమ్మకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చలికాలంలో విద్యార్థులు చలికి ఇబ్బందులు పడు తున్నారని, బెడ్‌షీట్లు పంపిణీ చేయాలని కోరారు. పెరిగిన ధరలకకు అనుగుణంగా కాస్మోటిక్‌, మెస్‌ చార్జీలను పెంచాలన్నారు. కార్యక్ర మంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వర్‌ యాదవ్‌, సురేంద్ర, హరి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T01:03:07+05:30 IST

Read more