ఐక్య ఉద్యమాలకు సిద్ధం కండి

ABN , First Publish Date - 2022-11-24T23:53:27+05:30 IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

ఐక్య ఉద్యమాలకు సిద్ధం కండి

నందికొట్కూరు, నవంబరు 24: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం సీఐటీయూ రెండో మహా సభ నందికొట్కూరులోని జై కిసాన పార్కులో జరుపుకున్నారు. మహాసభ సందర్భంగా సీఐటీయూ జెండాను సీనియర్‌ నాయకులు ఎస్‌.ఉస్మాన బాషా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభకు సీఐటీయూ మండల అధ్యక్షురాలు ఆర్‌.జయ అధ్యక్షతను జరిగింది. ఏసురత్నం, నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాలలన్నింటినీ కార్పొరేట్‌ శక్తులకు అమ్ముతూ దేశాన్ని దివాలా తీస్తోందని ఆరోపించారు. రోజురోజుకు పెరిగి పోతున్న ధరలతో ఉద్యోగులు కార్మికులు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ధరలు అదుపు చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా ఉద్యోగావకాశాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఫకీర్‌ సాహెబ్‌ వ్యాకాస మండల ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌, నాయకులు మద్దిలేటి, అంగనవాడీ వర్కర్స్‌ యూనియన నాయకురాలు మదార్సి, ఆశా వర్కర్స్‌ యూనియన నాయకురాలు నజరునిస్సా, వీవోఏల సంఘం నాయకులు రాలు మహేశ్వరమ్మ, వీఆర్‌ఏ సంఘం నాయకులు వాసు, హమాలీ వర్కర్స్‌ యూనియన నాయకులు కృష్ణ పాల్గొన్నారు

Updated Date - 2022-11-24T23:53:27+05:30 IST

Read more