పంచ వాహనంపై ప్రహ్లాదరాయలు

ABN , First Publish Date - 2022-08-17T05:37:14+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామి 351వ సప్తరాత్రోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి.

పంచ వాహనంపై ప్రహ్లాదరాయలు
పంచవాహన రథంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు

 సర్వసమర్పణతో ముగిసిన సప్తరాత్రోత్సవాలు

మంత్రాలయం, ఆగస్టు 16: మంత్రాలయం రాఘవేంద్రస్వామి 351వ సప్తరాత్రోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. ఏడు రోజులు జరిగిన సప్తరాత్రోత్సవాలకు పీఠాధిపతి సర్వసమర్పణోత్సవంతో ముగింపు పలికారు. మంగళవారం ఉదయం నుంచి రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణ, మహామంగళహారతులు ఇచ్చారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను వజ్రాలతో పొదిగిన హారాలతో అలంకరించి పల్లకిలో ప్రతిష్టించి ఊరేగించి ఊంజల సేవ చేశారు. అనంతరం గజ వాహనం, చెక్క, వెండి, బంగారు, నవరత్నాల రథాలపై ఊరేగించారు.

  ఉత్సవాల్లో భాగంగా యోగీంద్ర కళామండపంలో రాత్రి 10.30 గంటల సమయంలో యోగీంద్ర కళా మండపంలో శివమొగ్గకు చెందిన శార్వి బృందంచే నిర్వహించిన భరతనాట్యం భక్తులను ఆకట్టుకుంది. వీరి నృత్యాలను పీఠాధిపతి కనులారా తిలకించి నగదు, శేషవస్త్రం, ఫలపుష్ప మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. 
Read more