తుపాకీ పెట్టి ఒప్పించారు

ABN , First Publish Date - 2022-03-19T05:23:46+05:30 IST

చేయని నేరాన్ని ఒప్పుకోమని తలపై పిస్టో ల్‌ పెట్టి పోలీసులు ఒప్పించారని, లేకుంటే చంపుతాం అని బెదిరిం చారని సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి ఆవేదన చెందారు.

తుపాకీ పెట్టి ఒప్పించారు
మాట్లాడుతున్న విరుపాక్షి, పక్కన సీపీఐ నాయకులు

నేనేమైనా దేశద్రోహం చేశానా?
న్యాయం జరిగే వరకు పోరాడుతా
సీపీఐ ఆస్పరి మండల కన్వీనర్‌ విరుపాక్షి


ఆదోని, మార్చి 18:  చేయని నేరాన్ని ఒప్పుకోమని తలపై పిస్టో ల్‌ పెట్టి పోలీసులు ఒప్పించారని, లేకుంటే చంపుతాం అని బెదిరిం చారని సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి  ఆవేదన చెందారు. శుక్రవారం భీమాస్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆయన మాట్లాడుతూ ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తకు పోలీసులు రెచ్చిపోయి తనను బెదిరించారని అన్నారు. బట్టలు విప్పుతావా లేదా కుంటినాకొడకా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆస్పరి ఎస్‌ఐ మునిప్రతాప్‌.. మాటమార్చి తానే బట్టలు విప్పుకున్నట్లు తుపాకి పెట్టి ఒప్పించారని విరూపాక్షి తెలిపారు. ఒప్పుకోకపోతే కాల్చిపారేస్తామని పరుష పదజాలంతో దూషించారని ఆరోపించారు. 13వ తేదీన పత్తికొండలోని అత్తగారి ఇంట్లో తాను ఉండగా 14 మంది పోలీసులతో వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి కొట్టారని అన్నారు. అక్కడి నుంచి ఆస్పరికి తీసుకొచ్చి రాజశేఖర్‌, రమేష్‌లను హాలహర్వి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తూ తనను మాత్రం ఆదోనికి తరలించి ఎమ్మిగనూరు మీదుగా గోనెగండ్ల పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారన్నారు. అక్కడ ఎస్‌ఐ సురేష్‌, ఆస్పరి ఎస్‌ఐ మునిప్రతాప్‌ వీడియో రికార్డు చేసుకున్నారని, తన తలపై పిస్టోల్‌ పెట్టి చంపుతామని నానా దుర్భాషలాడుతూ తమకు అనుకూలంగా చెప్పించుకున్నారని వివరించారు. దీనిపై తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని అన్నారు. చెప్పించారన్నారు. తానేమీ దేశద్రో హానికి పాల్పడలేదని, పూర్తిగా న్యాయం జరిగేంతవరకు పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయిస్తామని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా  రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని హెచ్చరించారని అన్నారు. ఈ విషయంపై కూడా కోర్టులో తేల్చుకుంటానని ఆయన అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య  పాల్గొన్నారు.

Read more