వైసీపీని ప్రజలు విశ్వసించడం లేదు

ABN , First Publish Date - 2022-12-30T00:44:32+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించడం లేదని పాణ్యం టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

వైసీపీని ప్రజలు విశ్వసించడం లేదు

టీడీపీలో చేరిన రేమడూరు వైసీపీ నాయకులు


కల్లూరు, డిసెంబరు 29: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించడం లేదని పాణ్యం టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. గురువారం కల్లూరు మండలం రేమడూరు గ్రామానికి చెందిన 20 కుటుంబాల వైసీపీ నాయకులు టీడీపీ మండల కన్వీనర్‌ డి. రామాంజనేయులు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత టీడీపీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు కె. పార్వతమ్మ, పెద్దకొట్టాల రంగారెడ్డి, దొడ్డిపాడు బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:44:32+05:30 IST

Read more