జగన్‌ను ప్రజలు నమ్మరు

ABN , First Publish Date - 2022-07-05T06:39:38+05:30 IST

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

జగన్‌ను ప్రజలు నమ్మరు
బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న తిక్కారెడ్డి

మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి

మంత్రాలయం, జూలై 4: సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. సోమవారం మంత్రాలయం ఆర్టీసీ బస్టాండు వద్ద పెంచిన బస్సు చార్జీలకు నిరసనగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పన్నగ హోటల్‌ నుంచి రాఘవేంద్రసర్కిల్‌ మీదుగా ఆర్టీసీ బస్టాండుకు తిక్కారెడ్డి తోపాటు టీడీపీ రాష్ట్రకార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి, టీడీపీ నాయకులు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కి ప్రయాణికులతో పెంచిన చార్జీలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిలకలడోనలో దిగి టీకొట్టు వద్ద తిక్కారెడ్డి టీని తయారు చేసి పక్కనున్న ప్రజలతో పెంచిన చార్జీలను, వంట నూనె, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ నిత్యావసర సరుకుల ధరలపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ మండల అధ్యక్షుడు పన్నగ వెంకటేష్‌, జిల్లా అధికార ప్రతినిధి మాలపల్లి మాజీ సర్పంచ్‌ చావిడి వెంకటేష్‌, సత్యనారాయణరెడ్డి, వగరూరు రామిరెడ్డి, మాధవరం అమర్నాథ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, విజయరామిరెడ్డి, అబ్దుల్లా, సాల్మాన్‌ రాజు, చిదానంద, యేబు, హనుమంతు, భీమయ్య, నరసింహులు, రామయ్య, వెంకట్రాముడు, బొజ్జప్ప, తిక్కస్వామి, రవి, కేశవ, లింగన్న, బసవరాజు, శివ పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు: వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బాదుడే బాదుడులో కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని 30 వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో సంక్షేమ పథకాలను సాకుగా చూపి అభివృద్ధిని విస్మరించిందని అన్నారు.. పెరిగిన ధరలు, చార్జీలలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు కొండయ్య చౌదరి, కౌన్సిలర్లు రామదాసుగౌడ్‌, దయాసాగర్‌, పట్టణ అధ్యక్షుడు సుందరరాజు, మైనార్టీ అధ్యక్షుడు కేఎండీ ఫారుక్‌, మాజీ కౌన్సిలర్‌ పార్వతి, నాగేష్‌ ఆచారి, నరసింహాఆచారి, ముల్లా కలీముల్లా, రామకృష్ణ నాయుడు, మధు, మల్లి, దేవేంధ్ర, అంజినయ్య, అబ్దుల్‌, కృష్ణ, ఈరన్న పాల్గొన్నారు.


Read more