జోగుళాంబ దేవికి పట్టువస్త్రాల సమర్పణ

ABN , First Publish Date - 2022-10-03T06:18:28+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణాలోని అలంపూర్‌ క్షేత్రంలో వెలసిన జోగుళాంబా సమేత శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు కర్నూలు కలెక్టర్‌ పి. కోటేశ్వరరావు పట్టువస్త్రాలను సమర్పించారు.

జోగుళాంబ దేవికి పట్టువస్త్రాల సమర్పణ
పట్టువస్త్రాలను సమర్పిస్తున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు

కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 2: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణాలోని అలంపూర్‌ క్షేత్రంలో వెలసిన జోగుళాంబా సమేత శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు కర్నూలు కలెక్టర్‌ పి. కోటేశ్వరరావు పట్టువస్త్రాలను సమర్పించారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్‌ అలంపూర్‌ జోగులాంబదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సంద ర్భంగా అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం రోజున అలంపూర్‌ జోగు లాంబ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికార లాంచనాలతో అమ్మవారికి, స్వామివారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను కలెక్టర్‌ సమర్పించారు. తొలుత బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిం చారు. కలెక్టర్‌కు అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. కలెక్టర్‌ వెంట కర్నూలు దేవాదాయ శాఖ ఏపీ ఆదిశేషనాయుడు, అలంపూర్‌ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఈవో పురేంద్రకుమార్‌ ఉన్నారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం ఆలయ వేద పండితులు కలెక్టర్‌కు వేదాశీర్వచనంతో  తీర్థప్రసాదాలు అందజేశారు.


Read more