రైతులకు చేసిందేమీ లేదు

ABN , First Publish Date - 2022-09-19T05:56:05+05:30 IST

వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమి లేదని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మసీదుపురం గ్రామంలో టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించింది.

రైతులకు చేసిందేమీ లేదు

ఆర్డీఎస్‌ ఒక్క ఇంచు కూడా కదలలేదు
గ్రామాల వైపు కన్నెత్తి చూడని ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి


ఎమ్మిగనూరు, సెప్టెంబర్‌ 18: వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమి లేదని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మసీదుపురం గ్రామంలో టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. అలాగే గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారని, మరి ఆ నిధి ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు ఆర్డీఎస్‌ కుడి కాలువకు రూ. 2000 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా పనులు ఇంచు కూడా కదల లేదని అన్నారు. మైనార్టీలను మభ్యపెట్టేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజలపై ఎడాపెడా పన్నులు వేస్తున్నారని, ఆ డబ్బునే తిరిగి సంక్షేమ పథకాల పేరుతో ఇస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరిపై రూ.2.50 లక్షల అప్పు మోపిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో కరెంటు చార్జీలను తగ్గిస్తే ఈ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా విద్యుత్‌ చార్జీలు పెంచుతున్నారని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బింగించాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే మసీదుపురం గ్రామానికి ఒక్కసారైనా వచ్చారా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. అనంతరం లాంతర్లతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు రామలింగారెడ్డి, సోమేశ్వరరెడ్డి, మోకాసి రాముడు, కందనాతి కేశన్న, రాఘవేంద్ర, రాముడు, గోపాల్‌, ఈరన్న, అంజినయ్య, సురే్‌షచౌదరి, లోకారెడ్డి, వీరనాగప్ప, దేవదాసులు పాల్గొన్నారు.

Read more