ఒక్కరూ సుఖంగా లేరు

ABN , First Publish Date - 2022-08-31T06:03:33+05:30 IST

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఒక్కరు కూడా సుఖంగా లేరని తెలుగు దేశం పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు.

ఒక్కరూ సుఖంగా లేరు
మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

వినాయక మండపాలకు రుసుం వసూలు చేస్తారా?  
నీచంగా దిగజారిన జగన్‌ పాలన 
సోమిశెట్టి వెంకటేశ్వరు

కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 30:  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఒక్కరు కూడా సుఖంగా లేరని తెలుగు దేశం పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. మంగళవారం నగరంలోని  పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వినాయక విగ్రహాలపై మున్సిపల్‌, విద్యుత్‌, అగ్నిమాపక విభాగాల పేర్లతో ప్రజల నుంచి భారీగా రుసుం వసూలు చేయాలనే  నీచమైన ఆదేశాలను జగన్‌ మౌఖికంగా ఇవ్వడం దారుణమని అన్నారు. రెండు సంవత్సరాలుగా కరోనాతో ప్రజలు పండుగలు, ఉత్సవాలకు దూరమయ్యారని,  ఈ ఏడాది  వినాయక మండపాల నిర్వాహకుల నుంచి  విద్యుత్‌, తదితర రూపాల్లో రుసుం వసూలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించడం భావ్యం కాదని అన్నారు. నాయకులు హనుమంతరావు చౌదరి, సత్రం రామకృష్ణుడు, జేమ్స్‌, ఎల్లప్ప, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.


Read more