నేడు శ్రీశైలానికి కేంద్ర బృందం రాక

ABN , First Publish Date - 2022-01-03T05:44:46+05:30 IST

శ్రీశైలం జలాశయాన్ని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అధికారుల బృందం సోమవారం సందర్శించనున్నట్లు కర్నూలు నీటిపారుదల శాఖ సీఈ శ్రీశైలం జలాశయాన్ని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అధికారుల బృందం సోమవారం సందర్శించనున్నట్లు కర్నూలు నీటిపారుదల శాఖ సీఈ మురళీధర్‌ రెడ్డి తెలిపారు.

నేడు శ్రీశైలానికి కేంద్ర బృందం రాక

కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 2: శ్రీశైలం జలాశయాన్ని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అధికారుల బృందం సోమవారం సందర్శించనున్నట్లు కర్నూలు నీటిపారుదల శాఖ సీఈ శ్రీశైలం జలాశయాన్ని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అధికారుల బృందం సోమవారం సందర్శించనున్నట్లు కర్నూలు నీటిపారుదల శాఖ సీఈ మురళీధర్‌ రెడ్డి తెలిపారు. సీడబ్లూసీ గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన ఏబీ పాండేతో పాటు కన్‌స్ట్రక్షన్‌ సూపర్‌విజన్‌ ఎక్స్‌పర్ట్‌ ఈశ్వర్‌ చౌదరి, రిటైర్డు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ బీఎస్‌ఎన్‌ రెడ్డి, రిటైర్డు హైడ్రాలజిస్టు పి.రామరాజు, ఇంప్రుమెంటేషన్‌ అండ్‌ డిజైన్‌ ఎక్స్‌పెర్ట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ రౌత్‌ సత్యనారాయణ, రిటైర్డు జియాలజిస్టు డైరెక్టర్‌ జనరల్‌ ఎం.రాజు, హైడ్రో మెకానికల్‌ ఎక్స్‌పర్ట్‌ రిటైర్డు చీఫ్‌ ఇంజనీర్‌ కె.సత్యనారాయణ, ఆర్కిటెక్చర్‌ ప్లానింగ్‌ అండ్‌ ల్యాండ్‌ స్కాపింగ్‌ ఎక్స్‌పర్ట్‌ ఎండీ హాసీన్‌ జలాశయాన్ని పరిశీలిస్తారు. అత్యవసరంగా చేపట్టాల్సిన మరమ్మతులపై నివేదికను కేంద్ర జలశక్తి శాఖకు అందజేస్తారు. కేంద్ర జలశక్తి శాఖ నుంచి ప్రపంచ బ్యాంకు ఈ నివేదికను పంపుతారు. అక్కడ ఆమోదించిన తర్వాత డ్రిప్‌-2 కింద నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 

Read more