‘నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎ్‌సకు జాతీయ స్థాయిలో గుర్తింపు’

ABN , First Publish Date - 2022-02-17T05:17:51+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఏడీఆర్‌ డాక్టర్‌ సరళమ్మ అన్నారు.

‘నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎ్‌సకు జాతీయ స్థాయిలో గుర్తింపు’

నంద్యాల టౌన్‌, ఫిబ్రవరి 16: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఏడీఆర్‌ డాక్టర్‌ సరళమ్మ అన్నారు. బుధవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సరళమ్మ మాట్లాడుతూ 1906 లో పత్తి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారని, ఇక్కడో ఎన్నో పరిశోధనలు, కొత్త వంగడాల సృష్టించారని అన్నారు. ప్రస్తుతం ఆర్‌ఏఆర్‌ఎ్‌సలో 6 ప్రధాన పంటలపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. వరి, శనగ, జొన్న, పొగాకు, కొర్ర, ప్రొద్దు తిరుగుడు పంటల్లో పలు మేలైన కొత్త వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ వై. రామారెడ్డి, డాక్టర్‌ వి.జయలక్ష్మి, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-17T05:17:51+05:30 IST