‘దేశాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం’

ABN , First Publish Date - 2022-10-14T06:15:56+05:30 IST

దేశంలో ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం అని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు.

‘దేశాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం’

హాలహర్వి అక్టోబరు 13: దేశంలో ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం అని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. గురువారం ఛత్రగుడి వద్ద ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న రాహుల్‌ గాంధీ ఛత్రగుడి వద్ద బస చేస్తారని, కర్ణాటక రాష్ట్రం దాటి ఆంధ్రపదేశ్‌ సరిహద్దు చేరుకొని, 18వ తేదీన ఆలూరు మీదుగా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు, బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర బాబు పాల్గొన్నారు.

రాహుల్‌ గాంధీ పాదయాత్రకు ఆదరణ: తులసిరెడ్డి

ఆలూరు రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ఏపీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసి రెడ్డి అన్నారు. ఈ నెల 18 నుంచి రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో పాదయాత్రను జయ ప్రదం చేయాలని కోరుతూ గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మనే కుర్తి, హులేబీడు, కమ్మరచేడు గ్రామాల్లో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.3 లక్షల రుణమాఫీ, రూ.500 లకే వంట గ్యాస్‌, ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేస్తామని చెప్పారు. ఈ నెల 18 హాలహర్వి మండలం ఛత్రగుడి క్షేత్రం నుంచి రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్‌, కిషన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టీ గురునాథ రావు, రాష్ట్ర నాయకులు విజయకుమార్‌, తాంతియ కుమారి, శ్రీరాములు, లోక్‌నాథ్‌ పాల్గొన్నారు.


Read more