పోస్టుల దరఖాస్తు కోసం అవస్థలు

ABN , First Publish Date - 2022-08-17T05:30:00+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖలో అన్ని శాఖలతో కలుపుకొని కంబైన్డ నోటిఫికేషన ఉద్యోగాల కోసం ఉమ్మడి జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు బారులు తీరారు.

పోస్టుల దరఖాస్తు కోసం అవస్థలు
దరఖాస్తులు అందజేసేందుకు వచ్చిన అభ్యర్థులు

కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 17: వైద్య ఆరోగ్యశాఖలో అన్ని శాఖలతో కలుపుకొని కంబైన్డ నోటిఫికేషన ఉద్యోగాల కోసం ఉమ్మడి జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు బారులు తీరారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో 300 పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి వందలాది మంది అభ్యర్థులు వచ్చారు. అభ్యర్థులు క్యూలైనలలో నిలబడలేక నానా అవస్థలు పడ్డారు.  కనీసం తాగునీరు కూడా అధికారులు ఏర్పాటు చేయకపోవడం ఏమిటని చంటిపిల్లలతో వచ్చిన అభ్యర్థులు  మండిపడ్డారు.   27 రకాల పోస్టుల కోసం ఈ నెల 20వ తేదీ చివరి  తేదీ కావడంతో ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగులు వందల సంఖ్యలో వచ్చారు.
Read more