రేషన బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-03-17T05:25:29+05:30 IST

చాగలమర్రి గ్రామంలోని చింతలచెరువు రహదారిలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 30 క్వింటాళ్ల రేషన బియ్యం బుధవారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ రమణయ్య తెలిపారు.

రేషన బియ్యం పట్టివేత

చాగలమర్రి, మార్చి 16: చాగలమర్రి గ్రామంలోని చింతలచెరువు రహదారిలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 30 క్వింటాళ్ల రేషన బియ్యం బుధవారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ రమణయ్య తెలిపారు. యాగంటయ్య కల్లం వద్ద నిల్వ ఉంచిన 64 బస్తాల్లో ఉన్న 30 క్వింటాళ్ల రేషన బియ్యం పట్టుకున్నామని,  దస్తగిరి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు. దువ్వూరుకు చెందిన మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన రేషన బియ్యం సీజ్‌ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించామని అన్నారు. 


Read more