‘ఆదోని జిల్లా సాధనకు ఎమ్మెల్యేలు కృషి చేయాలి’

ABN , First Publish Date - 2022-02-16T05:53:59+05:30 IST

పశ్చిమప్రాంత ఐదు నియోజకవర్గాలను కలిపి ప్రభుత్వం ఆదోని జిల్లాను ఏర్పాటు చేయడానికి ఐదుగురు ఎమ్మెల్యేలు కృషి చేయాలని పత్తికొండ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి క్రాంతినాయుడు, పశ్చిమప్రాంత అభివృద్ధి వేదిక అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, జిల్లా సాధన సమితి నాయకులు నాగరాజుగౌడ్‌, శ్రీనివాసాచారి, కోటి అన్నారు.

‘ఆదోని జిల్లా సాధనకు ఎమ్మెల్యేలు కృషి చేయాలి’

9వ రోజుకు చేరుకున్న దీక్షలు

ఆదోని(అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 15: పశ్చిమప్రాంత ఐదు నియోజకవర్గాలను కలిపి ప్రభుత్వం ఆదోని జిల్లాను ఏర్పాటు చేయడానికి ఐదుగురు ఎమ్మెల్యేలు కృషి చేయాలని పత్తికొండ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి క్రాంతినాయుడు, పశ్చిమప్రాంత అభివృద్ధి వేదిక అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, జిల్లా సాధన సమితి నాయకులు నాగరాజుగౌడ్‌, శ్రీనివాసాచారి, కోటి అన్నారు. కోట్ల కూడలిలో ఆదోని జిల్లా సాధన సమితి రిలే దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో పత్తికొండ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి క్రాంతినాయుడు, డ్రాగన్‌ రంగ, తాయన్న, లక్ష్మన్న, గిరిరాజు కూర్చున్నారు. బాలకృష్ణ అభిమాని అఖండ సినిమా వేషధారణలో డ్రాగన్‌ రంగా దీక్షలో పాల్గొని ఆకర్షణగా నిలిచారు. ఆదినారాయణరెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ దేవిశెటి ్టప్రకాష్‌, యాదవ సంఘం నాయకుడు హుసేనప్పయాదవ్‌ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిరాం, సాయిప్రసాద్‌, తిరుమలేష్‌, రిటైర్డ్‌ టీచర్‌ దేవప్రసాద్‌, రవిశంకర్‌, బాలమణి, వెంకటేష్‌ పాల్గొన్నారు.

ఆదోని(అగ్రికల్చర్‌): ఆదోని జిల్లా సాధన కోసం రాజకీయ, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక సంఘాలతో కలుపుకుని ఐక్యతతో ఉద్యమిస్తామని ఆదోని జిల్లా సాధన కమిటీ కన్వీనర్‌ కోదండ, గౌరవ సలహాదారులు దస్తగిరి నాయుడు, మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు యూజీ శ్రీనివాసులు, పశ్చిమప్రాంత అభివృద్ధి వేదిక అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, ఆలూరు సాధన కమిటీ కన్వీనర్‌ రామలింగ, బీసీ ఫెడరేషన్‌ నాయకులు సాయిబాబా, షేక్షావలి అన్నారు. మంగళవారం పట్టణంలోని భావసాగర కళ్యాణ మండపంలో ఆదోని జిల్లా ఏర్పాటుపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్ల పశ్చిమప్రాంత పల్లెవాసులు ఉపాధి లేక వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవాలంటే కర్నూలు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి 175 కిలోమీటర్లుపైగా ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని జిల్లా ఏర్పాటైతే విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ నెల 26వ తేదీన ఆదోని డివిజన్‌ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి, ప్రజా సంఘ నాయకులు బండారు హనుమంతు, కుంకనూరు వీరేష్‌, రాజు, దేవిశెట్టిప్రకాష్‌, ధనాపురం, శేషన్న, వీరభద్ర, వెంకటేష్‌, సంజీవ్‌, సూర్య, తేజ, నవీన్‌, ప్రకాష్‌, రవి పాల్గొన్నారు.

మంత్రాలయం: కర్నూలు జిల్లాలో వెనుకబడిన ఆదోని ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రాయలసీమ విద్యార్థి సంఘాలు, నవ్యాంద్ర ఎమ్మార్పీఎస్‌ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. మంగళవారం ఆర్‌ఏవీఎఫ్‌ నాయకులు మోహన్‌, మోశే, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ నాయకులు అమ్రేష్‌, హనుమన్న, రాయలసీమ ప్రజాసంఘాల కన్వీనర్లు నాగన్న, ఖాజా, కృష్ణ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం నుంచి రాఘవేంద్ర సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని డివిజన్‌లోని నాలుగు డివిజన్ల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక, విద్య, వైద్య, ఎదుగుదల కోసం ఆదోనిని జిల్లా కేంద్రగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఏవీఎఫ్‌ నాయకులు వెంకటేష్‌, దస్తగిరి, విద్యార్తి సంఘాల నాయకులు, తదితర సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2022-02-16T05:53:59+05:30 IST