సచివాలయ సిబ్బందికి మెమోలు

ABN , First Publish Date - 2022-10-11T06:04:11+05:30 IST

నగర పాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో పని చేస్తున్న 20 మంది వార్డు అమ్యూనిటీ కార్యద ర్శులకు, 24 మంది వార్డు అడ్మిన్లకు మెమోలు జారీ చేస్తూ కమిషనర్‌ భార్గవ్‌తేజ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.

సచివాలయ సిబ్బందికి మెమోలు

కర్నూలు(న్యూసిటీ), అక్టోబరు 10: నగర పాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో పని  చేస్తున్న 20 మంది వార్డు అమ్యూనిటీ కార్యద ర్శులకు, 24 మంది వార్డు అడ్మిన్లకు మెమోలు జారీ చేస్తూ కమిషనర్‌ భార్గవ్‌తేజ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. నీటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వార్డు అమ్యూనిటీ సెక్రటరీలకు, ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వార్డు అడ్మిన్లకు మెమోలు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. వారం రోజులోపుల సంబంధిత సెక్రటరీలు సంజాయిషీ ఇవ్వాలని చెప్పి కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.


Read more