నేటి నుంచి సభ్యత్వ నమోదు

ABN , First Publish Date - 2022-04-25T05:03:32+05:30 IST

జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్టు టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడించారు.

నేటి నుంచి  సభ్యత్వ నమోదు

  సోమిశెట్టి వెంకటేశ్వర్లు 

కర్నూలు (అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 24: జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్టు టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టామని, ఇందులో భాగంగానే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఇనచార్జిలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా సభ్యత్వ కార్యక్రమం సోమవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పార్టీ సభ్యత్వం ఇస్తామని, పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కొంత మంది అనివార్య కారణాల వల్ల స్థానికంగా సభ్యత్వం తీసుకోలేకపోయిన వారు జిల్లా పార్టీ కార్యాలయంలో సభ్యత్వాన్ని తీసుకునేందుకు ఈ అవకాశం కల్పించామని తెలిపారు.


Read more