గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-02-17T05:27:53+05:30 IST

ఆదోని నుంచి ఢనాపురానికి వెళ్తున్న రామాంజి (32) అనే వ్యక్తిని అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఆదోని, ఫిబ్రవరి 16: ఆదోని నుంచి ఢనాపురానికి వెళ్తున్న రామాంజి (32) అనే వ్యక్తిని అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామాంజి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇస్వీ ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపారు. మృతుడికి భార్య నాగరత్నమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు   విలపించారు.

Read more