జాతీయ మహాసభలను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-10-08T05:52:20+05:30 IST

విజయవాడలో ఈనెల 14-18 తేదీల్లో జరిగే సీపీఐ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సి.రామచంద్రయ్య పిలుపునిచ్చారు.

జాతీయ మహాసభలను విజయవంతం చేయండి

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి. రామచంద్రయ్య

కర్నూలు(న్యూసిటీ), అక్టోబరు 7: విజయవాడలో ఈనెల 14-18 తేదీల్లో జరిగే సీపీఐ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సి.రామచంద్రయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం సీపీఐ కార్యాల యంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజానీకంపై భారాలు మోపుతోందని విమర్శించారు. వస్తువులపై అనేక రకాల పన్నులు విధిస్తూ దేశాన్ని నాశనం చేస్తుందన్నారు. దళితులు, మైనా ర్టీలు, అణగారిన వర్గాల ప్రజలపై మతం పేరుతో దాడులు చేస్తూ లౌకిక రాజ్యానికి తూట్లు పొడుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు చదువు కునే పాఠ్యపుస్తకాల్లో స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను తొలగించి, మతపర మైనటువంటి అంశాలను చేర్చడం దారుణమన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. చెత్త పన్ను పేరుతో తాను నియ మించిన వలంటీర్ల ద్వారా ముక్కుపిండి వసూలు చేయిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, సహాయ కార్యదర్శి ఎస్‌.మునెప్ప, జిల్లా కార్యవర్గసభ్యుడు కే.జగన్నాథం, రామక్రి ష్ణారెడ్డి, భాస్కర్‌యాదవ్‌, నబీరసూల్‌, పంపన్నగౌడు పాల్గొన్నారు.


Read more