వైభవంగా మహాలక్ష్మి హోమం

ABN , First Publish Date - 2022-08-01T06:03:25+05:30 IST

శ్రావణ మాసం పురష్కరించుకొని మహానంది మండలం గాజులపల్లి ఆర్‌ ఎస్‌ సమీపంలోని మరకతలింగేశ్వరుని ఆలయంలో ఆదివారం మహాలక్ష్మి హోమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు.

వైభవంగా మహాలక్ష్మి హోమం
హోమం నిర్వహిస్తున్న అర్చకులు

మహానంది, జూలై 31: శ్రావణ మాసం పురష్కరించుకొని మహానంది మండలం గాజులపల్లి ఆర్‌ ఎస్‌ సమీపంలోని మరకతలింగేశ్వరుని ఆలయంలో ఆదివారం మహాలక్ష్మి హోమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణం దాత, జ్యోతిష్కుడు కనుమర్లపూడి మస్తాన్‌రావు ఆధ్వర్యంలో ఉదయం నుంచి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమ గుండాల వద్ద వందలాదిమంది దంపతుల చేత మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించారు.లోక కళ్యాణ కోసం మరకత లింగేశ్వరుని ఆలయంలో హోమాలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

Read more