-
-
Home » Andhra Pradesh » Kurnool » Loans should be sanctioned by the bankers referred to by the collector-MRGS-AndhraPradesh
-
రుణాలు మంజూరు చేయాలి బ్యాంకర్లకు సూచించిన కలెక్టర్
ABN , First Publish Date - 2022-08-18T05:27:17+05:30 IST
జిల్లా రుణ ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు.

కర్నూలు(కలెక్టరేట్), ఆగస్టు 17: జిల్లా రుణ ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స హాలులో కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లకు సంబంధించిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా రుణ ప్రణాళిక లక్ష్యం రూ.10,537 కోట్లు రుణాలు మంజూరు లక్ష్యం కాగా, బ్యాంకర్లు ఇప్పటి వరకు 35 శాతంతో రూ.3779 కోట్లు రుణాలు మంజూరు చేశారన్నారు. ప్రధానంగా వ్యవసాయ అనుబంద రంగాల్లో రుణాలు మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అగ్రి టర్మ్ లోన్సకు సంబంధించి కెనరా బ్యాంకు, యూనియన బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీజీబీ, యాక్సిస్ బ్యాంకు, హెచడీఎఫ్‌సీ, అగ్రి ఇనఫ్రాకు సంబంధించి కెనరా, సిటీ యూనియన బ్యాంకు అనుబంధ రంగాల్లో హెచడీఎఫ్‌సీ బ్యాంకు మాత్రమే రుణాలు మంజూరు చేశాయన్నారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎం వెంకటనారాయణ, కెనరా బ్యాంకు డీఎం రవీంద్రనాథ్ రెడ్డి తదితర బ్యాంకర్లు పాల్గొన్నారు.