అమరజీవి ఆశయ సాధనకు కృషి చేద్దాం

ABN , First Publish Date - 2022-03-16T05:30:00+05:30 IST

అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం కృషి చేద్దామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అన్నారు.

అమరజీవి ఆశయ సాధనకు కృషి చేద్దాం
ఆదోనిలో నివాళి అర్పించిన మీనాక్షినాయుడు, నాయకులు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు

ఆదోని, మార్చి 16: అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం కృషి చేద్దామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అన్నారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీనాక్షినాయుడు మాట్లా డుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణా లర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. కార్యక్ర మంలో మదిరె మారెప్ప, నల్లన్న, బుద్ధారెడ్డి, నాగరాజు, జయకుమార్‌, లక్ష్మన్న, నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు.

మంత్రాలయం: మంత్రాలయం ఆర్యవైశ్య సంఘం హక్కుల సాధన సమితి మండల అధ్యక్షుడు వెంకటేష్‌ శెట్టి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నారాయణశెట్టి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బుధవారం పొట్టి శ్రీరాముల చిత్రపటంతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో కుబేరయ్యశెట్టి, రాజన్నశెట్టి పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు (టౌన్‌): పట్టణంలోని గ్రంథాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి హరికృష్ణ, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మీస్రవంతి, బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సౌభాగ్య, సుశీలమ్మ, విశ్రాంత ఉపాధ్యాయుని సుందరీబాయి పాల్గొన్నారు.

ఆలూరు: ఆలూరు మండలంలోని అరికెర డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల కళాశాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ప్రిన్సిపాల్‌ కిష్టప్ప, అధ్యాపకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని నిర్వహించి ఆయన చిత్రపటానికి ప్రిన్సిపాల్‌ వెంకట నరసయ్య పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. తుంబలబీడు గ్రామ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో పొట్టిశ్రీరాములు జయంతిని నిర్వహించారు. హెచ్‌ఎం ఈరన్న, ఉపాధ్యాయ సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు.

Read more