దేశాన్ని కాపాడుకుందాం: సీపీఎం

ABN , First Publish Date - 2022-09-24T06:38:22+05:30 IST

బీజేపీ ప్రభుత్వ కబందహస్తాల నుంచి దేశాన్ని కాపాడుకుందామని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ పిలుపునిచ్చారు.

దేశాన్ని కాపాడుకుందాం: సీపీఎం

కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 23: బీజేపీ ప్రభుత్వ కబందహస్తాల నుంచి దేశాన్ని కాపాడుకుందామని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ పిలుపునిచ్చారు.  శుక్రవారం 14, 15, 16, 17, 36, 37, 41 వార్డులలో దేశ రక్షణ భేరి ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారన్నారు. మోదీ ప్రభుత్వం ప్రభు త్వరంగ సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసీ, బ్యాంకులు, పోస్టల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు అన్నింటిని ప్రైవేటీకరణ చేస్తున్నా రని ఆరోపించారు. ఆదాని, అంబానీ కార్పొరేట్లకు పోర్టులు, విమానాశ్రయాలు, టెలికాం, విద్యుత్‌ ఇలా ఒక్కొక్కటి ధారాదత్తం చేస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల, అలివేలమ్మ, సుధాకరప్ప, శ్యామలమ్మ, డి.అబ్దుల్‌దేశాయ్‌, షరీఫ్‌ పాల్గొన్నారు.


Read more