‘బీఎస్‌ఎన్‌ఎల్‌ను కాపాడుకుందాం’

ABN , First Publish Date - 2022-09-21T06:07:02+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ను కాపాడుకుందామని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ సంస్థ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌ఈయూ)ఆల్‌ ఇండియా జనరల్‌ ఉపాధ్యక్షురాలు, రాష్ట్ర కార్యదర్శి కే.రమాదేవి పిలుపునిచ్చారు.

‘బీఎస్‌ఎన్‌ఎల్‌ను కాపాడుకుందాం’

కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 20: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ను కాపాడుకుందామని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ సంస్థ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌ఈయూ)ఆల్‌ ఇండియా జనరల్‌ ఉపాధ్యక్షురాలు, రాష్ట్ర కార్యదర్శి కే.రమాదేవి పిలుపునిచ్చారు. రాబోయే యూనియన్‌ 9వ సభ్యత్వ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం స్థానిక శ్రీనివాసనగర్‌లోని టెలిఫోన్‌ ఎక్ఛేంజ్‌ కార్యాలయ ఆవరణలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు ఆల్‌ ఇండియా జనరల్‌ సహాయ కార్యదర్శి సంపత్‌ రావు, ఏపీ ఉపాధ్యక్షుడు, సహయ కార్యదర్శి, పి.అక్బర్‌బాషా, ఎస్‌.కృష్ణబాలాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ విధానాల నుంచి సంస్థను కాపాడేశక్తి కేవ లం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈయూకే ఉందన్నారు. 4జి స్పెకా్ట్రమ్‌, ఉద్యోగులకు పే రివిజన్‌ సాధించడంలో కేంద్ర ప్రభు త్వంతో పోరాడతామని అన్నారు. కార్యక్రమంలో ఈయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాథ్‌గౌడు, ప్రధాన కార్యదర్శి ఎన్‌.రామరాజు, ఉపాధ్యక్షుడు డీవీ రామిరెడ్డి, సర్కిల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రీనివాసులు, అన్వర్‌ హుసేన్‌ పాల్గొన్నారు.


Read more